FbTelugu

తెలంగాణలో నేడు భారీ వర్షాలు

హైదరాబాద్: ఉత్తర్ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఇవాల తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

You might also like