FbTelugu

బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండ్రోజుల పాటూ ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.

You might also like