FbTelugu

ముంబై లో కుండపోతగా వర్షాలు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఏకంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కుండపోతగా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత ఐదేళ్లలో ఒకే రోజు ఇంత భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. వరుసగా 3 రోజులుగా కురుస్తున్న కుండపోతతో ముంబై సహా శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెంబూరు, వడాలా, ధారావి, అంధేరి, హింద్ మాత జంక్షన్, ఖర్ సబ్ వే, మిలన్ సబ్ వే, దహిసర్ సబ్ వే, కొలబా అబ్జర్వేటరీ ప్రాంతాలలో 20 సెంటీమీటర్ల వరకు కురిసింది.

పొవాయి చెరువులోకి నీటి రాక పెరగడంతో పొంగిపొర్లుతున్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. ముంబై పౌరులు సముద్ర తీరం, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని పోలీసులు కోరారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు.

You might also like