FbTelugu

కుంగిన రోడ్డు… కుండపోత వర్షం

హైదరాబాద్: నగరంలోని ఏఎస్ రావు నగర్ లో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. భూమిపై చీలికలు రావడంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై వాహనాలను మళ్లించారు.
ఈలోపే భూమి కుంగిపోవడంతో వాహనదారులు, ప్రజలు కంగారుపడ్డారు. అందరూ చూస్తుండగా భారీ గొయ్యి ఏర్పడింది. ఈ విషయాన్ని వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు తెలియచేయగా చేరుకుని కుంగిన రోడ్డును పరిశీలించారు.

బుధవారం సాయంత్రం కుండపోతగా కురిసిన వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు రోడ్లపై వరదనీరు చేరుకోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతు నీరు చేరుకున్నది. ఖైరతాబాద్, బేగంపేట, ఆబిడ్స్, మెహదీపట్నం, రాజేంద్రనగర్, లంగర్ హౌస్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, బంజారాహిల్స్, జుబ్లిహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

You might also like