FbTelugu

ఉపరితల ద్రోణితో కురుస్తున్న వర్షాలు

కేరళను రెండు రోజులు ఆలస్యంగా తాకిన నైరుతి
న్యూఢిల్లీ: కేరళలో రెండు రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు తాకగా, తెలంగాణలో రెండు రోజులు ముందుగానే అడుగుపెట్టాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.
ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రయ ఈశాన్య రాష్ట్రాలలో ప్రవేశించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి మరట్వాడ, తెలంగాణ, రాయలసీమల మీదుగా ఉత్తర తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. ద్రోణితో తెలంగాణలో రెండు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు అడుగు పెట్డడంతో ప‌లు ప్రాంతాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి.

ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రా, దక్షిణ కోస్తా ఆంధ్ర తో పాటు యానాం వంటి ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురవనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.