FbTelugu

రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలో 3 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అబ్దు్ల్లాపూర్ కాల్వంచలో అత్యధికంగా 8.02 సెం.మీ వర్షం నమోదైంది. అనేక ప్రాంతాలు ముంపునకు గురైనాయి.

అక్కడక్కడ చెట్టు విరిగిపోగా.. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ప్రభావంతో రాష్ట్రం మొత్తం మేఘావృతమై ఉంది.

You might also like