FbTelugu

బెంగళూరులో భారీ వర్షం..

బెంగళూరు: మహానగరంలో మండుటెండలతో అల్లాడుతున్న ప్రజలకు వరుణుడు ఉపశమనం కల్పించాడు. మండువేసవిలో భారీవర్షం కురిసింది.

దీంతో మహానగరంలో ఆకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. ఆదివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు రోడ్లు జలమయం అయ్యాయి. రోడ్లపై చెట్లు కుప్పకూలడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ లో నిండిపోయి మురికినీరు రోడ్ల మీదకు రావడంతో బాటసారులు ముందుకు కదల్లేకపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.