FbTelugu

తెలంగాణకు భారీ వర్ష సూచన

హైదరాబాద్: ఉత్తర, తూర్పు తెలంగాణలో ఈ రోజు అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. అనుబంధంగా 7.6కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణ, ఉత్తర కోస్తాలో మూడు రోజుల పాటూ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

You might also like