FbTelugu

భారలోహం, సీసం తోనే వింత రోగాలు

ప.గో. జిల్లా: ఏలూరు నగరంలో గత మూడు రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న వింత రోగం పై నివేదికలు వస్తున్నాయి. ఈ వింత రోగంపై ఇప్పటికే నమూనాలు సేకరించిన పరిశోధనా సంస్థలు కారణాలను అన్వేషిస్తున్నాయి.
ఇప్పటి వరకు నాలుగు వందల మందికి పైగా పలు ఆసుపత్రుల్లో చేరి చికిత్స తీసుకుంటుండగా వీరిలో ఇద్దరు ప్రాణాలు వదిలారు. రోగుల శరీరంలో భార లోహం (హెవీ మెటల్ లెడ్) అధికంగా ఉండడం మూలంగా మూర్చ, వాంతులు వస్తున్నట్లు మంగళగిరిలోని ఏయిమ్స్ నిపుణుల బృందం తేల్చింది. భార లోహంతో పాటు సీసం (నికెల్) కూడా ఉన్నట్లు నిర్థారించింది.
మంచినీరు లేదా పాల ద్వారా ఇది మనుషుల శరీరంలోకి చేరి ఈ సమస్యకు కారణమైనట్లుగా స్పష్టమైంది. అయితే ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బహిరంగపర్చాల్సి ఉంది.

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా తినే ఆహారం లేదా తాగునీరు లేదా పాలే వింతరోగానికి కారణమరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. దీని మూలంగా నాడీ వ్యవస్థపై న్యూరో టాక్జిన్స్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కంటికి సంబంధించి నల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో ప్యూపిల్ డైలటేషన్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. మయో క్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చని గుంటూరు వైద్య నిపుణుల బృందం చెబుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.