FbTelugu

భారీగా గంజాయి పట్టివేత

విశాఖ: 970 కేజీల గంజాయి పట్టుబడిన ఘటన జిల్లాలోని చింతపల్లి మండలం లంబసింగిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్సైజ్ అధికారులు జరిపిన దాడిలో భారీ మొత్తంలో సుమారు 970 కేజీల గంజాయిని తరలిస్తున్న ముఠా పట్టుబడింది. దీంతో అధికారులు గంజాయిని సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు.

You might also like