FbTelugu

ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలు

భారత్ లో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తం 8,500 అప్రెంటీస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది. తెలంగాణ‌కు 460, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 620 పోస్టులున్నాయి.

రెండు విధాలుగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుందని తెలిపింది. 1.రాతపరీక్ష ఉత్తీర్ణత అనంతరం 2.లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు వ‌చ్చేనెల 10 వ‌ర‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 10. పరీక్ష 2021 జనవరిలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్ నుంచి పొందవచ్చు.

You might also like

Leave A Reply

Your email address will not be published.