* ఈశాన్య రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు
* పొంగిపొర్లుతున్న భ్రహ్మపుత్ర, ఇతర నదులు
డిస్పూర్: భారత ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా అసోంలో వరదలతో 7 జిల్లాలు, 180 గ్రామాలు జలదిగ్బందంలోనే ఉన్నాయి. బీహార్ లో పిడుగులతో కూడిన వర్షాలు భారీగా పడడంతో 83 మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో చిన్నారులే అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన కేంద్రం సహాయక చర్యలు ప్రారంభించింది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. కాగా ఈ రోజు కూడా వర్షం పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలెవరూ ఇళ్లనుంచి భయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది.