FbTelugu

శ్రీశైలానికి భారీగా వరద

కర్నూలు: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 3,38,164 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. దిగువకు 4,11,032 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.5 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 212.77 టీఎంసీల నీరు ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.