FbTelugu

బిరబిరా కృష్ణమ్మ పరవళ్లు

కర్నూలు: గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. దీంతో శ్రీశైలం 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ప్రస్తుతం ప్రాజెక్టులోని 84,216 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 1,42,628 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంటీలు కాగా.. ప్రస్తుతం 213 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

You might also like