FbTelugu

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో ఓ ఫర్నీచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవ శాత్తూ ఫర్నీచర్ షాపులో మంటలు అంటుకుని షాప్ మొత్తం వ్యాపించాయి.

మంటలు తీవ్రంగా ఎగిసిపడుతుండడంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

You might also like