FbTelugu

ఏటీఎంలో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు: ఏటీఎంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న ఘటన జిల్లాలోని అరండపేట సమీపంలోని ఓ ఏటీఎంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక అరండపేటలోని ఓ ఎస్బీఐ ఏటీఎంలో ప్రమాదవ శాత్తూ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

దీంతో బ్యాంకుతో పాటూ పై అంతస్తులోకి కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే ఏటీఎం పూర్తిగా దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

You might also like