FbTelugu

భారీ జరిమానాలు… ఠారెత్తుతున్న ఆసుపత్రులు

విజయవాడ: ప్రభుత్వ నిబంధనల ను ఉల్లంఘించిన 35 ఆస్పత్రులపై గత రెండు రోజుల్లో రూ.2.86 కోట్ల పరిహారం విధించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి), జిల్లా కోవిడ్ నోడల్ అధికారి ఎల్.శివ శంకర్ ప్రకటించారు.
కృష్ణా జిల్లాలో ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స కోసం అందించే ఆరోగ్య సేవల్లో 50 శాతం ఆరోగ్య శ్రీ, ఈ.హెచ్.ఎస్ సౌకర్యం ఉన్నవారికి వైద్య సేవలు అందించాలని ఆయన స్సష్టం చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 52 ఆసుపత్రులకు రూ.3.61 కోట్ల పరిహారం విధించామన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మూడు ఆంధ్రా ఆసుపత్రులపై రూ.56 లక్షలు, నీమ్రా పై రూ.20 లక్షలు, ఆయుష్ రూ.20 లక్షలు, గాయత్రి రూ.20 లక్షలు, క్యాపిటల్ రూ.16 లక్షలు, స్మైల్ రూ.16 లక్షలు, సన్ రైజ్ రూ.15 లక్షలు, కామినేని రూ.13 లక్షలు, లిబర్టీ హాస్పిటల్స్ కి రూ.11 లక్షలు, కేవ్ షైన్ ఆసుపత్రికి రూ.10 లక్షలు చొప్పున జరిమానా వేశామని జెసి శివశంకర్ అన్నారు.
ఏ ఆసుపత్రిలో ఐనా 50 శాతం మంచాలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇవ్వాలని, లేనిచో చర్యలు తప్పవన్నారు. నోడల్ అధికారులు, ఆసుపత్రి పర్యవేక్షకులదే పూర్తి బాధ్యత అన్నారు. చికిత్స లు చేసే ప్రతి చెల్లింపునకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి. ఒకవేళ మార్గదర్శకాలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జెసి శివశంకర్ హెచ్చరించారు
కరోనా రోగులకు కాక్‌టెయిల్‌ యాంటిబాడీస్‌ బ్రహ్మస్త్రం
హైదరాబాద్: కరోనా రోగుల్లో కాక్‌టెయిల్ యాంటిబాడీస్‌ బ్రహ్మాస్త్రంగా పని చేస్తున్నాయని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజి) తెలిపింది.
కరోనా రోగులకు తాజాగా వచ్చిన చికిత్సపై ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వివరణ ఇచ్చింది. కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్ వినియోగానికి డిసిజిఐ అనుమతి ఉందని పేర్కొంది. ప్రస్తుతం 2 లక్షల డోసుల దిగుమతికి అనుమతి ఉందని వెల్లడించింది. కాక్‌టెయిల్‌ యాంటిబాడీస్ ఒక ఇంజక్షన్‌ ఖరీదు రూ. 65 వేల అని ఏఐజీ వెల్లడించింది. ఒక రోగికి ఒక డోసు ఇంజక్షన్‌ సరిపోతుందని, రెమిడెసివిర్ మాదిరి ఎక్కువ ఇంజక్షన్లు అవసరం లేదని వివరించింది. ఒక డోసు తీసుకున్న వారంలో కరోనా నుంచి కోలుకుంటున్నారని ఏఐజీ తెలిపింది.

ఢిల్లీలో మేదాంత హాస్పిటల్ లో ఒక వృద్ధ రోగి (82) కాక్‌టెయిల్‌ యాంటీబాడీస్ ఇంజక్షన్ ఇచ్చి, మరుసటి రోజులు డిశ్చార్జీ చేశారు. అతని ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నట్లు మేదాంత హాస్పిటల్ ప్రకటించింది. గతేడాది అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ కాగా ఇలాంటి చికిత్సనే అందించి త్వరగా కోలుకునే విధంగా చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.