FbTelugu

భారత్ లో భారీగా కరోనా కేసులు

న్యూఢిల్లీ: భారత్ లో కొత్తగా నమోదౌతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి తీవ్రంగా పెరిగిపోతూ ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 52,050 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇదే సమయంలో 803 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.

తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,55,746 కి చేరింది. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 38,938 కి చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 12,30,510 మంది కోలుకుని ఆస్పత్రులనుంచి డిశ్చార్జ్ అయినారు. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 5,86,298 ఉన్నాయి.

You might also like