FbTelugu

బెజవాడలో భారీగా బ్లాక్ ఫంగస్ కలకలం

విజయవాడ: నగరంలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా నమోదవుతుండడంతో ప్రజలు కలవరపడుతున్నారు. ప్రతి ఈ.ఎన్.టి హాస్పిటల్ లో రోజులో 10 లోపు కేసులు వస్తుండగా, సింగరేణి హాస్పిటల్స్ లో రోజుకి 7, 8 కేసులు నమోదవుతునట్లు సమాచారం.

బ్లాక్ ఫంగస్ లక్షణాలతో వచ్చినవారికి ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు ఈ హాస్పిటల్లో లిపోసామాల్ అంఫోటేరిసిన్ బి ఇంజక్షన్ అందుబాటులో ఉండడం లేదు. దేశంలో కేవలం నాలుగు చోట్లే ఈ ఇంజక్షన్ తయారీ అవుతుండడంతో కొరత పట్టిపీడిస్తున్నది. దీని బారిన పడ తీవ్రంగా ఉన్న ఒక రోగికి శస్త్ర చికిత్స చేయాలంటే కనీసం 104 వైల్స్ కావాల్సి ఉంటుంది. రోగి వైట్ ను బట్టి ఒక కేజీ వైట్ కి ఐదు మిల్లి గ్రాముల ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. రోజు మార్చి రోజు జోల్ డేర్వేటివ్స్ టాబ్లెట్స్ ఇవ్వాలి. అయితే ఈ ఫంగస్ ను ముందుగానే గుర్తిస్తే సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పటికే కరోనా కేసులతో సతమతమవుతుండగా కొత్తగా బ్లాక్ ఫంగస్ రోగం మరింత కలకలం రేపుతుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.