FbTelugu

భారీగా పట్టుబడిన రేషన్ బియ్యం

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం భారీగా పట్టుబడ్డాయి. లారీలో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్టు తెలిపారు.

దీంతో ఆ లారీని, మూడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. పలువురు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like