FbTelugu

భారీగా పట్టుబడిన గంజాయి

సంగారెడ్డి: ఎక్సైజ్ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడిన ఘటన జిల్లాలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక
ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఎక్సైజ్

అధికారులు తనిఖీలు నిర్వహించగా మూడు కార్లలో సుమారు 300 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like