FbTelugu

అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు: ఈటల

హైదరాబాద్: అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలోనే ఉందని, లాక్ డౌన్ లు పెట్టేంత పరిస్థితి దిగజారలేదని ఆయన అన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 400 చొప్పున కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతున్నది. వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. విద్యాలయాలు, హాస్టళ్లలో పలువురు విద్యార్థులు కరోన బారినపడ్డారు.

ఇద్దరికి ముగ్గురికి టెస్టు చేస్తే పాజిటివ్ వచ్చిన సందర్భంగా మిగతా వారికి పరీక్షలు నిర్వహిస్తే పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. రాపిడ్ టెస్టుల్లో నెగెటివ్ వస్తుండగా, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో మాత్రం పాజిటివ్ వస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కు రాపిడ్ టెస్టులో తొలుత నెగెటివ్ వచ్చింది. టెస్టు రిపోర్టు సరిగా లేదని భావించిన ఆయన ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా తల్లిదండ్రులకు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ ముప్పు నుంచి తప్పించేందుకు పాఠశాలలను మూసివేయడమే మేలని వైద్య, ఆరోగ్య శాఖ విద్యాశాఖకు లేఖ రాసింది. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోనున్నదో తెలియాల్సి ఉన్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.