FbTelugu

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: ఎంపీ రఘురామ

తూర్పుగోదావరి: ఏలూరు పరిసర ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. జిల్లాలో వింత రోగం, తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. లేఖలో పలు అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఏలూరు ఘటన తనని తీవ్రంగా కలిచివేసిందని, వెంటనే ఏలూరుకు నిపుణులైన వైద్యులను, అవసరమైన మందులను పంపాలని కోరారు.
ఏలూరు నగరపాలక సంస్థ, పరిసర ప్రాంతాలలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు. దీనిపై ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరెడ్డితో సంప్రదించాలంటూ సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.