FbTelugu

జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి: అల్లం నారాయణ

హైదరాబాద్: జర్నలిస్టులందరికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కోరారు.

సోమవారంనాడు బిఆర్ కేఆర్ భవన్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కలిశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తుందన్నారు.  వీరందరికి విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. టీవీ5 ఛానల్ విలేకరి మనోజ్ కుమార్ యాదవ్ విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారిన పడి ఆకస్మికంగా మృతి చెందారని అన్నారు.

ప్రతి జర్నలిస్టుకు కరోనా కిట్ (మాస్క్, శానిటైజర్, పీపీఈ కిట్, గ్లౌజ్) సరఫరా చేయాలని నారాయణ కోరారు. జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులను అన్ని ఆరోగ్య సమస్యలకు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం అందే విధంగా, టెస్ట్ లకు కూడా వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జర్నలిస్టులకు రూ.20 లక్షల ప్రమాద భీమా వర్తింప జేయాలని అన్నారు. జర్నలిస్టులందరికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఈటల హామీ ఇచ్చారు.

You might also like