FbTelugu

ఏపి ఆర్టీసీ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు

అమరావతి‌: వైఎస్.జగన్ ప్రభుత్వం ఏపిఎస్ ఆర్టీసి లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇకనుంచి ఆర్టీసీ ఉద్యోగులు సైతం ప్రభుత్వ ఉద్యోగుల  మాదిరిగా రిఫరల్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందవచ్చని ప్రకటించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే మాదిరిగా ఎంప్లాయ్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌)కార్డులను ఆర్టిసీ ఉద్యోగులకు జారీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్డులను వినియోగించుకుని రిఫరల్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యసేవలు పొందవచ్చు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన విధంగా సిఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.