FbTelugu

హైకోర్టు ఆదేశంతో హెల్త్ బులెటిన్

హైదరాబాద్: ప్రతిరోజు కరోనా బులెటిన్ విడుదల చేయాలని, ఎంత మందికి వ్యాక్సినేషన్ చేసిన వివరాలు కూడా పత్రికాముఖంగా ప్రకటించాలని హైకోర్టు ఆదేశించడంతో రాష్ట్ర ప్రభత్వం హెల్తె బులెటిన్ మళ్లీ విడుదల చేస్తున్నది.

రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 40,985 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా 176 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,807కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. ఆదివారం నాడు కరోనాతో ఒకరు మృతి చెందగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,634కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజే 163 మంది కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,95,222.
రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,951 ఉండగా.. వీరిలో 859 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.