FbTelugu

వైరల్ అవుతున్న హెడ్ మాస్టర్ వీడియో

నెల్లూరు: కరోనా బారినుంచి తనని కాపాడండి అంటూ.. ఓ హైస్కూల్ హెడ్ మాస్టర్ వేడుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళితే.. రమేష్ కుమార్ అనే వ్యక్తి నెల్లూరు జిల్లా మనుబోలు హైస్కూల్ హెడ్ మాస్టర్.

అతడు అనుకోకుండా కరోనా బారిన పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న రమేష్ కుమార్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాడు. కానీ గంటలు గడుస్తున్నా అక్కడ అతన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. కలెక్టర్, ఎమ్మెల్యే అయినా కల్పించుకొని తనని కాపాడాలని కోరాడు. అనంతరం అతన్ని ఆస్పత్రిలో చేర్చుకున్నారు. చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు.

You might also like