FbTelugu

పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకున్నాడు…

ముంబయి: శిక్షణ కోసం వెళ్లిన ఒక వ్యక్తికి ప్రభుత్వ హాస్పిటల్ లో ఒక డాక్టర్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగడంతో ఆమెను పలుమార్లు లైంగికంగా అనుభవించాడు. పెళ్లి ప్రస్తావన తేవడంతో ఫొటోలు బయటపెడతానని బెదిరించాడు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పుదుచ్చేరికి చెందిన ఒకరు నాగపూర్ లోని నేషనల్ అకాడమెమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ లో శిక్షణ నిమిత్తం వెళ్లాడు.

అక్కడ వైద్యురాలిగా పనిచేస్తున్న ఒకామెతో పరిచయం ఏర్పడింది. తాను కూడా యుపిఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు వైద్యురాలు ఆయనతో చెప్పగా ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి శారీరకంగా కలిసే వరకు వెళ్లింది. ప్రేమించానని చెప్పడంతో పలుమార్లు లైంగికంగా కలుసుకున్నారు. ఇటీవలే గర్భవతి కావడంతో అబార్షన్ కూడా చేయించాడు. పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో అతను తన నైజాన్ని బయటపెట్టాడు. అశ్లీల భంగిమల ఫొటలు బయటపెడతానని బెదిరించడంతో ఆమె కంగుతిన్నది.
తనకు అన్యాయం చేశాడని గమనించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపిసి సెక్షన్ 376 (2) కింద అతనిపై కేసు నమోదు చేశారు. అతను ప్రస్తుతం బెంగళూరు లో పనిచేస్తున్నాడు. విచారించి అతన్ని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.