FbTelugu

ఆది పురుష్ కు ఆయనే సంగీత దర్శకుడు!

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాకు దర్శకుడు ఎవరనేది ఇంత వరకు వెల్లడించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభం కాగా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

తాజాగా బాలీవుడ్ సంగీత దర్శకులు సాచెత్ టండన్, పరంపరా ఠాకూర్ లు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారనే టాక్ వినపడుతోంది. హీరో ప్రభాస్ గతంలో నటించిన సాహో సినిమాలోని సైకో సైయాన్ పాటకు మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న జెర్సీ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. రూ.500 కోట్లతో నిర్మితమవుతున్న ఆది పురుష్ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానున్నది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. టి సిరిస్ ఫిల్మ్స్, రెట్రో ఫిల్స్ పతాకంపై చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.