FbTelugu

కేరళ బీజేపీ సీఎం అభ్యర్థి ఆయనే

అధికారికంగా ప్రకటించిన బీజేపీ
తిరువనంతపురం: కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెట్రో మ్యాన్ శ్రీధరన్ సీఎం అవుతారని ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.సురేంద్రన్ ప్రకటించారు.

క్లిష్లమైన ప్రాంతాల్లో రైల్వే లైన్లు, ఢిల్లీ మెట్రో రైలు నిర్మాణంలో కీలక భూమిక పోషించిన శ్రీధరన్ ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరక ముందే లవ్ జీహాదీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అబ్బాయిలు ప్రేమ పేరుతో హిందూ, క్రైస్తవ అమ్మాయిలను ముగ్గులోకి దింపి మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అదే విధంగా పదవీ కాలం గురువారంతో ముగియనున్నందున ఆ మరుసటి రోజు నుంచే ప్రచారంలో పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు. శ్రీధరన్ కు ఉన్న నీతి నిజాయితీని బీజేపీ ఉపయోగించుకోవాలనే ఉద్ధేశంతోనే సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.