FbTelugu

సుశాంత్ చావుతో తనకు సంబంధం లేదు: ఆదిత్య

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ చనిపోవడానికి, తనకూ ఎలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి, సీఎం కుమారుడు ఆదిత్య థాక్రే ఖండించారు. ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

సుశాంత్ కేసులో నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. బాలీవుడ్ సినీ పరిశ్రమతో తనకు పరిచయాలు ఉన్నాయని, అదేం పెద్ద నేరం కాదని ఆయన కొట్టిపారేశారు. తను హిందూ నాయకుడు బాలాసాహెబ్ థాక్రే మనవడినని, మరఠా గౌరవానికి శివసేనకు మచ్చ తెచ్చే పని ఎప్పుడూ చేయనని ఆదిత్య థాక్రే స్పష్టం చేశారు. ఈ బురద రాజకీయంలోకి తనను అనవసరంగా లాగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

You might also like