FbTelugu

సొంతూరుకు చేరకుండానే కుప్పకూలాడు

చిత్తూరు: లాక్ డౌన్ లో మరో వలస కూలీ తన గమ్యం చేరకుండానే నడిరోడ్డుపైనే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని చంద్రగిరి బైపాస్ రోడ్ లో చోటుచేసుకుంది.  వివరాల్లోకెళితే..

మోహన్ రావు అనే వలస కూలీ లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక తన సొంతూరు శ్రీకాకుళం జిల్లా ముచ్చెందరకు కాలినడకన బయలుదేరాడు. బాగా అలసిపోయి ఏదైనా వాహనం వస్తుందేమోనని ఆ కల్వర్టుపైనే చాలాసేపు ఎదురు చూశారు. అయినా ఏ వాహనం రాలేదు. మోహన్ రావు ఆ కల్వర్టుపైనే కుప్పకూలి మృతి చెందాడు.

You might also like