FbTelugu

అజారుద్దిన్ పై తిరగబడ్డ హెచ్.సి.ఎ సభ్యులు

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఎ) సమావేశం రచ్చరచ్చ అయ్యింది. హెచ్.సి.ఎ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దిన్ పై సభ్యులు తిరుగుబాటు చేశారు. ఆయనను ప్రసంగానికి అడుగడుగునా అడ్డుతగిలారు.

ఇవాళ వార్షిక సర్వసభ్య సమావేశం జరగ్గా, 186 మంది క్లబ్ కార్యదర్శులు హాజరయ్యారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. అవినీతి పెరిగిందని, డబ్బులిచ్చినవారినే సెలెక్ట్ చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. సమావేశం రసాభాసగా మారడంతో కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు మధ్యలోనే వెళ్లిపోయారు. దీపక్ వర్మను అంబుడ్స్ మెన్ గా నియమించాలని అజారుద్దిన్ వర్గం పట్టుబట్టగా, ఆయన నియామకాన్ని వ్యతిరేక వర్గం ససేమిరా అని స్పష్టం చేసింది. ఏకాభిప్రాయం రాకపోవడంతో ఏప్రిల్ 11వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.