FbTelugu

హెచ్.సి.ఏ అధ్యక్షుడిగా జాన్ మనోజ్

హైదరాబాద్: ఇటీవలే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి అజారుద్దీన్ ను తొలగించిన అపెక్స్ కౌన్సిల్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నది. ఆయన స్థానంలో జాన్ మనోజ్ ను అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
జాన్ మనోజ్ ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.

అజారుద్దీన్ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోవడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా మనోజ్ ను నియమించారు. గత కొన్ని రోజులుగా హెచ్.సి.ఏ లో వివాదాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఎవరికి వారుగా గ్రూపు రాజకీయాలు చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. అత్యుత్తమ క్రికెటర్లను తయారు చేసే బదులు డబ్బులు వెనకేసుకోవడంపైనే కార్యవర్గ పెద్దలు దృష్టి సారించడం శోచనీయం.

You might also like

Leave A Reply

Your email address will not be published.