FbTelugu

విజయవాడలో హవాలా కలకలం

విజయవాడ: నగరంలో నలుగురు వ్యక్తులు రూ.30 లక్షల నగదుతో పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు కర్నూలు కాగా, మరో ఇద్దరు విజయవాడ కు చెందిన వారిగా గుర్తించారు.

బత్తాయి వ్యాపారానికి సంబంధించిన సొమ్ముగా అవాస్తవాలు చెప్పే యత్నం చేశారు. పొంతన లేని విధంగా సమాధానాలు చెప్పడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. కర్నూలు కి చెందిన నూర్ భాషా, వెంకట రమణ, బెజవాడ వన్ టౌన్ కి చెందిన గుంట్ల సాంబశివ రావు, సందీప్ ఓజా గా పై కేసులు నమోదు చేశారు.

You might also like