FbTelugu

హత్రాస్ బాధితురాలి ఫొటో నా భార్యది’!

సోషల్ మీడియాలో హత్రాస్ బాధితురాలంటూ.. చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో చనిపోయిన తన భార్యదంటూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు. వివరాల్లోకెళితే.. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తన చనిపోయిన భార్య ఫొటోను హత్రాస్ బాధితురాలి ఫొటోగా వైరల్ చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు.

పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ ఫిర్యాదును పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒక వేళ ఈ ఫిర్యాదు నిజమని తేలితే గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లపై కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 09 కి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.