అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసిందా అని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆస్తుల అమ్మితేనే అభివృద్ధి చేయగలరా అని ప్రశ్నించింది.
ప్రభుత్వ భూముల అమ్మకాలపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. బిల్డ్ ఏపీని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారించిన సందర్భంలో హైకోర్టు ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. లాక్ డౌన్ అమల్లో ఉంటే ఇంత అత్యవసరంగా వేలానికి వెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించింది. హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులకు లోబడే ఈ-వేలం జరపాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలుకు అడిషినల్ అడ్వొకేట్ జనరల్ గడువు కోరారు. తదుపరి విచారణ 28కి వాయిదా వేసింది.