FbTelugu

ప్రభుత్వంపై నమ్మకం పోయింది: చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలను ప్రభుత్వం కాపాడుతుందనే నమ్మకం ప్రజల్లో పోయిందని మన దేవాలయాలను మనమే కాపాడుకుందామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు కురిపించారు. ఆయన అన్నారు. తమ హయాంలో ఒక్క మసీదు, చర్చిపై కూడా దాడులు జరగలేదని అన్నారు. గ్రామాల్లో చర్చిలు పెరిగిపోతున్నాయని…

ఈ విషయంపై హిందువులు ఆలోచన చేయాలన్నారు. పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు ప్రభుత్వం ఇవ్వడం చట్ట విరుద్ధమన్నారు. రామతీర్థంకు వెళ్లేందుకు తమకు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి మార్గమధ్యంలో ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో హిందువులతో పాటు ముస్లింలపై కూడా దాడులు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. తాము పర్యటన చేపట్టిన తర్వాత ప్రభుత్వంలో భయం ప్రారంభమైందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.