FbTelugu

రాందేవ్ బాబా నోర్మూసుకో: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

న్యూఢిల్లీ: అల్లోపతి వైద్య విధానంపై యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యాలను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ సూచించారు. ఆయన వ్యాఖ్యలు డాక్టర్ల మనోభావాలతో పాటు దేశ ప్రజలను అవమానించేదిగా ఉందని అన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ యోగా గురువు రాందేవ్ బాబాకు లేఖ రాశారు. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా వైద్యులు, శాస్త్రవేత్తలు నిరంతరం పనిచేస్తున్నారన్నారు. వారికి మద్ధతుగా హెల్త్ వర్కర్లు నిద్రహారాలు మాని విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా నుంచి లక్షలాది మంది ప్రాణాలను వైద్యులు కాపాడారని, అయినా వారి వైద్య విధానంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమన్నారు. రోగులకు సేవలు చేస్తూ డాక్టర్లు, నర్సులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత సేవ చేస్తున్న అల్లోపతి వైద్య విధానాన్ని చులకన చేస్తూ బాబా చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరైనవి కావదని కేంద్ర మంత్రి ఖండించారు. పోలియో, ఎబోలా, టిబి, మలేరియాల వంటి రోగాలకు అల్లోపతి వారే వ్యాక్సిన్లు కనిపెట్టారనే విషయాన్ని మర్చిపోరాదన్నారు. కరోనా వ్యాక్సిన్ కూడా అల్లోపతిక్ నుంచే వచ్చిందనే విషయాన్ని గమనించాలని హర్షవర్థన్ ఆ లేఖలో హితవు పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.