FbTelugu

హుర్రే… హార్లే డేవిడ్ సన్ గుడ్ బై!

ఢిల్లీ: భారత్ లో లాభదాయకతకు, పెట్టుబడుల విలువకు అంతగా ప్రాధాన్యముండదని, అందుకే ఇక్కడి నుంచి మూటా ముళ్లె సర్ధుకుని అమెరికా వెళ్లెందుకు హర్లే డేవిడ్ సన్ కంపెనీ పరిశీలిస్తోంది.

హార్లే డేవిడ్ సన్ మోటార్ సైకిల్ కంపెనీ కి ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. భారీ నాణ్యతా ప్రమాణాలతో ఖరీదైన టూ వీలర్లను విపణిలోకి తీసుకువస్తుంది. వ్యాపార విస్తరణలో భాగంగా పదేళ్ల క్రితం ఇండియా లో అడుగు పెట్టింది. అయితే ఇక్కడ ఆశించిన విధంగా విక్రయాలను సాధించలేకపోయింది. పెట్టుబడులు, మేధాసంపత్తికి తగ్గట్టుగా లాభాలను పొందలేకపోయింది. ఇండియాలో నాణ్యత కన్నా చౌక ధరలపై అధిక ప్రాధాన్యత ఇస్తారనేది కంపెనీ తన పదేళ్ల అనుభవంలో గమనించింది.

గతేడాది ఇండియాలో కేవలం 2500 బైకులను మాత్రమే విక్రయించ గలిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు కేవలం 100 బైక్ లను మాత్రమే విక్రయించడంతో పునరాలోచనలో పడ్డారు. ఇండియాలో ఇంతగా శ్రమించే బదులు అగ్రరాజ్యంలో శ్రమిస్తే ఆశించిన ఆదాయం వస్తుందనేది కంపెనీ వాదనగా ఉంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న హార్లే డేవిడ్ సన్ కంపెనీ తన కార్యకలాపాలను చుట్టేసి అమెరికా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే.

You might also like