FbTelugu

హరీశ్ నా పేరు కాపాడాడు: కేసీఆర్

సిద్దిపేట: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ.హరీశ్ రావును సీఎం కేసీఆర్ ప్రశంసల్లో ముంచెత్తారు. తన పేరను కాపాడిన హరీశ్ సిద్దిపేట ఆణిముత్యమంటూ ఆయన పొగిడారు.

ఇవాళ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, సిద్దిపేట నుంచి వెళ్లి తెలంగాణ సాధించా, ప్రజల్లో చేతుల్లో పెట్టానన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చూస్తుంటే ఆనందంగా ఉందని, హరీశ్ నా పేరు కాపాడి అద్భుతంగా పనిచేస్తున్నాడని కితాబునిచ్చారు.
రంగనాయక సాగర్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ కింద మడు నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు మిగిలాయని, మల్లన్నసాగర్ వద్ద లిఫ్టు పెట్టి వారికి తాగునీరు అందిస్తామని అన్నారు. రూ.165 కోట్ల వ్యయంతో సిద్దిపేట నియోజకవర్గ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. సుమారు 22 గ్రామాలను చుట్టుకుంటూ ఈ రింగ్ రోడ్డు నిర్మాణం ఉంటుందన్నారు. పట్టణంలో మరో వేయి డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేస్తున్నామని, దీంతో పాటు త్రీ టౌన్ పోలీసు స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కోమటి చెరువు అభివృద్ధికి మరో రూ.25 కోట్లు, రూ.50 కోట్లతో ఆడిటోరియం నిర్మాణం చేస్తామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.