FbTelugu

ప్రతిపక్షాల విమర్శలు.. తప్పుకున్న హరీశ్ సాల్వే!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయంపై కోర్టు సహాయకుడిగా (అమికస్ క్యూరీ) గా నియమితులైన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే పై ప్రతిపక్షాలు విమర్శించడంతో తప్పుకున్నారు.

ఇవాళ సుప్రీంకోర్టు లో ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ.బోబ్డే నేతృత్వంలో ధర్మానం విచారణ ప్రారంభించగానే అమికస్ క్యూరీగా తప్పుకుంటున్నట్లు విన్నవించారు. ప్రస్తుతం దేశం అయోమయ పరస్థితుల్లో ఉందని, సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తున్న అత్యంత సున్నతమైన అంశం అని ఆయన తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి బోబ్డే పాఠశాల, కళాశాల రోజుల నుంచి తనకు తెలుసు అని, అందువల్ల విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఆయన అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది.
ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు నిర్ణయం పై కొందరు సీనియర్ న్యాయవాదులు చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం అసంతృప్తి వెలిబుచ్చింది. సాల్వేపై వచ్చిన విమర్శలపైనా ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది హైకోర్టుల్లో విచారణలు ఆపాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.