FbTelugu

వ్యాక్సిన్ పై హ‌ర్భ‌జ‌న్‌ సంచలన వ్యాఖ్యలు

కరోనా వ్యాక్సిన్ పై భారత ప్రముఖ మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ల పట్ల ఆయా సంస్థలు ప్రకటించుకున్న అక్యూరసీ రేటును ఆధారంగా చేసుకొని.. మోడెర్నా వ్యాక్సిన్ 94.5 శాతం, ఫైజర్ అండ్ బయోటెక్ 94 శాతం, ఆక్స్ ఫర్డ్ 90 శాతం అక్యూరసీ రేటు ఉన్నాయని ఏ వ్యాక్సిన్ వాడకపోయినా భారత్ లో 93.6 శాతం అక్యూరసీ ఉందనీ.. ఇలాంటి సందర్భంగా వ్యాక్సిన్ అవసరమా అంటూ.. ట్వీట్ చేశారు.

దీనిపై పలువురు భిన్న విధాలుగా రాయాక్ట్ అవుతున్నారు. ఇలాంటి పోస్ట్‌లు పెట్టవద్దంటూ.. హితవు పలుకుతున్నారు. వ్యాక్సిన్ అవసరం లేదంటే కోలుకున్న 93.6 శాతం పోగా.. మిగిలిన 6.4 శాతం మంది అంటే 140 కోట్ల మందిలో ఎంతో తెలుసా అంటూ ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.