FbTelugu

నగ్నవీడియోలతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

చెన్నై: బాత్ రూంలో ఓ బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాగాయంలో ఓ బాలిక(14) స్నానం చేస్తుండగా.. కొందరు యువకులు రహస్యంగా వీడియో తీశారు.

ఆపై వీడియోను బహిర్గతం చేస్తామని నిత్యం ఫోన్లు చేస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారు. దీంతో వేధింపులు తాళలేక నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనకు కారకులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మైనర్ అని తెలిపారు.

You might also like