FbTelugu

సింగర్ మధుప్రియకు వేధింపులు!

హైదరాబాద్: సింగర్ మధుప్రియకు కొద్ది రోజులుగా బ్లాంక్ కాల్స్, అసభ్యకరమైన సందేశాలు వెల్లువలా వస్తున్నాయి. ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో కూడా తెలియకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శనివారం నాడు షీ టీమ్ కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు పంపించింది. తనకు వస్తున్న బ్లాంక్ కాల్స్ వివరాలను కూడా జతచేసింది. సోషల్ మీడియా ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదును పరిశీలించిన షీ టీమ్ అధికారులు ఐపిసి 509, 354బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత కేసును సైబర్ క్రైమ్ స్టేషన్ కు బదిలీ చేశారు. పలు షోలలో తన పాటలతో అలరించిన మధుప్రియ తన ప్రేమ, పెళ్లి వ్యవహారంలోనూ వార్తల్లో నిలిచింది. ఫిదా తోపాటు సరిలేరు నీకెవ్వరు సినిమాలో పాటలు పాడి ఆకట్టుకున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.