FbTelugu

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

రంగారెడ్డి: భర్త నుంచి వేరుగా ఉంటున్న ఒక మహిళను నిత్యం వేధింపులకు గురి చేయడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

ఈశ్వరమ్మ పుప్పాలగూడలో నివాసం ఉంటున్నది. రెండు సంవత్సరాల క్రితం భర్త రెడ్యా నాయక్ కత్తితో దాడి చేయడంతో ఆయన నుంచి వేరుగా ఉంటున్నది. ఈశ్వరమ్మ ఒంటరిగా ఉండడంతో పెళ్లి చేసుకోవాలంటూ ఉన్యా నాయక్ నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడు. వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు పంపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.