FbTelugu

అధికారుల వేధింపులు.. రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

కృష్ణా: అధికారుల వేధింపులు తాళలేక ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రాయనపాడుకు చెందిన రాజు అనే రైల్వే ఉద్యోగి (కీమెన్) సెల్ఫీ వీడియో తీసుకుంటూ.. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు.

ఐతే తను అధికారుల వేధింపులు తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశాడు. అది గుర్తించిన కొందరు అతన్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు.

You might also like