FbTelugu

మసీదులో హనుమాన్ చాలీసా

లక్నో: మసీదులో హనుమాన్ చాలీసా జపం చేసేందుకు అనుమతించిన ఇమామ్ కు మసీదు కమిటీ గట్టి షాక్ ఇచ్చింది. వేయి కాదు రెండు వేలు కాదు ఏకంగా రూ.5 లక్షలు జరిమానా విధించారు.

ఉత్తరప్రదేశ్ లోని వినయ్ పూర్ కు చెందిన మనుపాల్ బన్సాల్ జనసంఖ్య సమాధాన్ ఫౌండేషన్ కు ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఒక కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతించాల్సిందిగా మసీదు ఇమామ్ అలీ హసన్ ను కోరాడు. ఇమామ్ అనుమతించడంతో మనుపాల్ హనుమాన్ చాలీసా పారాయణం చేశడు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ముస్లిం సమాజం కూడా పెద్దగా పట్టించుకోలేదు.

ఆ తరువాత ఇమామ్ అలీ హసన్, మనుపాల్ ను ముస్లిం పెద్దలు పిలిపించి పంచాయతీ చేశారు. మసీదులో హనుమాన్ చాలీసా చేసేందుకు అనుమతించిన ఇమామ్ కు రూ.5 లక్షలు, చాలీసా పారాయణం చేసిన మనుపాల్ కు కూడా రూ.5 లక్షలు జరిమానా వేశారు. కమిటీ  తీర్పు మేరకు ఇద్దరు సంతకం చేసి వచ్చారు. దీనిపై ఇమామ్ స్పందిస్తూ, తన వద్దకు మనుపాల్ వచ్చి, మసీదులలో కూర్చోవడానికి అనుమతి కావాలని అడిగాడు. కాదని ఎలా అనగలం అని ప్రశ్నించాడు. ప్రతిఒక్కరికి దేవుడి సన్నిధిలో కూర్చునే హక్కు ఉందన్నాడు. తప్పు చేశావంటూ నన్ను మసీదు నుంచి వెళ్లగొట్టాడు. ఉపాధి కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.