FbTelugu

బాలుడి చికిత్స ఖర్చులు నేనే భరిస్తా: ఎమ్మెల్యే హన్మంతు

హైదరాబాద్: మల్కాజ్ గిరి టిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పందించారు. విద్యుత్ షాక్ కు గురై గాయాలపాలైన బాలుడు వైద్య ఖర్చులు నేనే భరిస్తానని ఆయన అన్నారు.

బాలుడు చికిత్సకు ఎంత ఖర్చయినా తానే భరిస్తానని తల్లికి హామీ ఇచ్చారు. ఆదివారం సైనిక్ పూర్ లోని అంకూర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నిశాంత్ (8) సంవత్సరాల బాలుడ్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి బతికించాలని డాక్టర్లను సూచించినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. మల్కాజిగిరి సర్కిల్ లో ఉన్న ప్రతి ట్రాన్స్ఫార్మర్ కు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.