FbTelugu

మహారాష్ట్రలో సగం కర్ఫ్యూ అమలు

వెనక్కి తగ్గి ఊరటనిచ్చిన సిఎం ఉద్ధవ్
ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచే
సెలూన్లు, పార్లర్లు మూసివేత
ముంబయి: మహారాష్ట్రలో ఠారెత్తించే విధంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో తప్పని పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలు చేయాలని సిఎం ఉద్ధవ్ థాకరే నిర్ణయించారు.
ఈ మేరకు ఆయన ప్రతిపక్ష నాయకులతో ఫోన్ లో మాట్లాడి వాస్తవాలను వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా సరే అనడంతో లాక్ డౌన్ అమలు చేయాలని సిద్ధమయ్యారు. పూర్తి స్థాయి లాక్ డౌన్ మూలంగా ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని, ఉపాధి లేక కూలీలు, ప్రేవేటు ఉద్యోగులు రోడ్డున పడతారని కొందరు మంత్రులు సూచించడంతో ఆయన వెనక్కి తగ్గారు. 24 గంటల బదులు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు సిఎం ఉద్ధవ్ ప్రకటించారు.

ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని సిఎం కార్యాలయం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు కేవలం 50 శాతం సామర్థ్యంతోనే పనిచేయాలని, పారిశ్రామిక, నిర్మాణ కార్యకలాపాలకు అనుమతించింది. స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని, 10, 12 తరగతులకు ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. ప్రైవేటు ఉద్యోగులు సాధ్యమైనంత మేరకు ఇంటినుంచే పనిచేసేలా ఆయా సంస్థలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే బ్యూటీ పార్లర్లు, సెలూన్లు మూసివేయాలని ఆదేశించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.